Nara Lokesh: ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ.

|

Jul 28, 2024 | 3:34 PM

తల్లికి వందనం పథకంపై శాసన మండలిలో ఏపీ మంత్రి నారా లోకేశ్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పథకం వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌కు వెళ్లే విద్యార్థులు అందరికీ ఇస్తామన్నారు లోకేష్‌. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. విధివిధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ఈ పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు.

తల్లికి వందనం పథకంపై శాసన మండలిలో ఏపీ మంత్రి నారా లోకేశ్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పథకం వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌కు వెళ్లే విద్యార్థులు అందరికీ ఇస్తామన్నారు లోకేష్‌. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. విధివిధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ఈ పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. తల్లికి వందనం పథకానికి గైడ్ లైన్స్ ను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పైగా ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులందరికీ వర్తిస్తుందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తామని ఎన్నికల ప్రచారంలోనే చెప్పామని, ఆ మాటకు కూడా కట్టుబడి ఉన్నామన్నారు. నిబంధనలు రూపొందించేందుకు కాస్త సమయం కావాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పథకాన్ని అమలు చేయడమే తమ లక్ష్యమన్నారు. ఈ అంశంపై మంత్రులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఒక్కొక్కరికి 15 వేలు ఇస్తామని చెప్పి.. ఆ తర్వాత 14 వేలు, అనంతరం 13 వేలకు ఆ మొత్తం తగ్గిందని లోకేష్ అన్నారు. అర్హత నిబంధనలను కూడా గత ప్రభుత్వం మార్చిందన్నారు. ఈ పథకంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నామన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on