Telangana: ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. సంస్థ ప్రభుత్వంలో విలీనం
ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. దాంతో.. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కానుండటంతో.. పెండింగ్‌లోనున్న బిల్లులను ప్రభుత్వం ఆమోదించుకోనుంది. ఐదుగంటలకు పైగా సాగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. అనంతరం సెక్రటేరియట్ మీడియా పాయింట్‌లో మంత్రులు మాట్లాడుతున్నారు. ఇప్పుడా లైవ్ చూద్దాం.
నూతన సచివాలయం ప్రారంభం అయిన తర్వాత రెండవసారి తెలంగాణ కేబినెట్ సమావేశం అయ్యింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుమారు 40 నుంచి 50 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై క్యాబినెట్‌లో ప్రధానంగా చర్చ జరిగింది. భారీగా ఆస్తి, పంట నష్టం జరగడంతోపాటు రోడ్లు పెద్దయెత్తున దెబ్బతిన్నాయి. దాంతో.. నష్టాన్ని అంచనా వేసి, పరిహారంపై నిర్ణయం తీసుకోనుంది. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల పునరుద్దరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 3వేల కోట్ల నష్టం జరిగినట్లు ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ప్రభుత్వంలో TSRTCని విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్.
Published on: Jul 31, 2023 08:06 PM
వైరల్ వీడియోలు
Latest Videos