Watch Video: ‘నాగార్జునసాగర్‎ను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మారుస్తాం’.. మంత్రి జూపల్లి కృష్ణారావు..

|

Jun 09, 2024 | 8:52 AM

నాగార్జునసాగర్ బుద్ధవనంను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి జూపల్లి. పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్‎గా తీర్చిదిద్దుతామని చెప్పారు. నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి కలిసి నాగార్జున సాగర్‎లోని హిల్ కాలనీలో ఉన్న బుద్ధవనంలోని బుద్ధిని పాదాలు, జ్ఞాన మందిరంను మంత్రి జూపల్లి సందర్శించారు. టూరిజం ప్రమోషన్‎లో భాగంగా బుద్ధవనంను సందర్శించామని మంత్రి తెలిపారు.

నాగార్జునసాగర్ బుద్ధవనంను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి జూపల్లి. పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్‎గా తీర్చిదిద్దుతామని చెప్పారు. నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి కలిసి నాగార్జున సాగర్‎లోని హిల్ కాలనీలో ఉన్న బుద్ధవనంలోని బుద్ధిని పాదాలు, జ్ఞాన మందిరంను మంత్రి జూపల్లి సందర్శించారు. టూరిజం ప్రమోషన్‎లో భాగంగా బుద్ధవనంను సందర్శించామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్‎గా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.

బౌద్ధ టూరిజం సర్క్యూట్‎లో తెలంగాణలోని బుద్ధవనంను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జునసాగర్‌లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారని కొనియాడారు. యావత్ భారతదేశంతోపాటు ప్రపంచానికి బౌద్ధ వారసత్వం, సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నాగార్జున సాగర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్ల ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి జూపల్లి తెలిపారు. ఆచార్య నాగార్జునుడు నడయాడిన ఈ ప్రాంతాన్ని ప్రజలు తప్పక సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on