Vivekananda Rock: వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర మోదీ ధ్యానానికి కారణం ఇదేనా.?
ప్రధాని మోదీ కన్యాకుమారి వెళ్లారు. అక్కడ ప్రసిద్ధి చెందిన వివేకానంద రాక్ మెమోరియల్ లో ధ్యానం చేయడం ఈ పర్యటన ఉద్దేశం. మరి మోదీ అక్కడికి వెళ్లడం ఇదే ఫస్ట్ టైమా? లేక ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్లారా? మీకు ఇప్పుడో ఫోటో చూపిస్తాను. ఇదే ఆ ఫోటో. ఇందులో మోదీని చూశారుగా! దాదాపు 32 ఏళ్ల కిందట మోదీ.. ఇదే వివేకానంద రాక్ మెమోరియల్ కు వెళ్లినప్పటి ఫోటో ఇది. ఆయన అప్పుడు అక్కడికి ఎందుకు వెళ్లారు అన్నది కూడా చెప్పుకుందాం.
ప్రధాని మోదీ కన్యాకుమారి వెళ్లారు. అక్కడ ప్రసిద్ధి చెందిన వివేకానంద రాక్ మెమోరియల్ లో ధ్యానం చేయడం ఈ పర్యటన ఉద్దేశం. మరి మోదీ అక్కడికి వెళ్లడం ఇదే ఫస్ట్ టైమా? లేక ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్లారా? మీకు ఇప్పుడో ఫోటో చూపిస్తాను. ఇదే ఆ ఫోటో. ఇందులో మోదీని చూశారుగా! దాదాపు 32 ఏళ్ల కిందట మోదీ.. ఇదే వివేకానంద రాక్ మెమోరియల్ కు వెళ్లినప్పటి ఫోటో ఇది. ఆయన అప్పుడు అక్కడికి ఎందుకు వెళ్లారు అన్నది కూడా చెప్పుకుందాం. దానికన్నా ముందు.. ఇప్పుడు మోదీ అక్కడికి ఎందుకు వెళ్లారు అన్నది చూద్దాం. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం పూర్తయిన తరువాత మోదీ ధ్యానం కోసం.. అక్కడికి వెళ్లారు. కిందటిసారి సార్వత్రిక ఎన్నికల ప్రచారం అయ్యాక.. కేదారనాథ్ వెళ్లారు. అక్కడ దాదాపు 15 గంటల పాటు ధ్యానం చేశారు. మరి ఈసారి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏమిటి?
వివేకానంద రాక్ మెమోరియల్ తమిళనాడులోని కన్యాకుమారిలో ఉంది. సముద్ర తీరం నుంచి.. అంటే వవాతురై బీచ్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం ప్రత్యేకత ఏంటంటే.. హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం.. ఈ మూడు ఇక్కడే కలుస్తాయి. అందుకే దీనిని పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. 1892లో స్వామీ వివేకానంద ఇక్కడే ధ్యానం చేశారు. మూడు రోజుల పాటు పగలూ రాత్రీ ధ్యానంలోనే ఉన్నారు. దీనివల్ల ఆయన అద్భుతమైన జ్ఞానసంపదను పొందారని అంటారు. బలమైన, సుసంపన్నమైన, దివ్యమైన, భవ్యమైన భారతదేశం కోసం కలలు కన్న వివేకానందుడికి.. ఆ ధ్యానం అంతులేని శక్తిని అందించిందని చెబుతారు. ఆ తరువాతే ఆయన.. 1893లో ప్రపంచ సర్వ మత మహాసభలో పాల్గోవడానికి అమెరికాలోని చికాగోకు వెళ్లారు. అక్కడ ఆయన ప్రసంగానికి అంతా ముగ్ధులయ్యారు. తన స్పీచ్ తో విదేశీయులను మెప్పించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.