JP Nadda: తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నిక.. బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో జేపీ నడ్డా..

|

Nov 20, 2023 | 6:49 AM

తెలంగాణలో రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అన్ని పార్టీల నుంచి స్టార్‌ క్యాంపెయినర్లు దూకుడుగా జనంలోకి వెళ్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలను ప్రకటించిన అన్ని పార్టీలు ఇక ప్రచారంలో దూకుడు పెంచుతున్నాయి. 32 అంశాలు 10 ముఖ్యమైన అంశాలతో కూడిన.. సకల జనుల సౌభాగ్య తెలంగాణ 'మన మోదీ గ్యారెంటీ... బీజేపీ భరోసా' పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీజేపీ.

తెలంగాణలో రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అన్ని పార్టీల నుంచి స్టార్‌ క్యాంపెయినర్లు దూకుడుగా జనంలోకి వెళ్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలను ప్రకటించిన అన్ని పార్టీలు ఇక ప్రచారంలో దూకుడు పెంచుతున్నాయి. 32 అంశాలు 10 ముఖ్యమైన అంశాలతో కూడిన.. సకల జనుల సౌభాగ్య తెలంగాణ ‘మన మోదీ గ్యారెంటీ… బీజేపీ భరోసా’ పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీజేపీ. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ పాల్గొనగా.. మేనిఫెస్టో రిలీజ్‌ అయిన తర్వాత ఫస్ట్ టైం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఇవాళ బీజేపీ నిర్వహించే మూడు సభల్లో పాల్గొంటారు జేపీ నడ్డా. చేవెళ్ల, నారాయణపేట్‌ సభలకు హాజరవుతారు. అలాగే మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో నిర్వహించే రోడ్‌షో పాల్గొంటారు జేపీ నడ్డా. మేనిఫెస్టోను గడపగడపకు తీసుకెళ్లేలా పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేస్తారు.

తెలంగాణ పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నారాయణ పేట సభలో పాల్గొన్నారు. జేపీ నడ్డా బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో ప్రసంగిస్తున్నారు.. లైవ్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..