Jayalalitha: జయలలిత నగలు వేలం !! వచ్చిన డబ్బుతో ??
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయనున్నారు. అక్రమాస్తుల కేసులో 2014లో బెంగళూరు ప్రత్యేక కోర్టు జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు నాలుగేళ్ల జైలు శిక్ష, తలా రూ.10 కోట్ల జరిమానా విధించింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ నలుగురు కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేశారు.
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయనున్నారు. అక్రమాస్తుల కేసులో 2014లో బెంగళూరు ప్రత్యేక కోర్టు జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు నాలుగేళ్ల జైలు శిక్ష, తలా రూ.10 కోట్ల జరిమానా విధించింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ నలుగురు కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేశారు. కేసు విచారించిన హైకోర్టు నలుగురిని విడుదల చేస్తూ తీర్పునిచ్చింది. అనంతరం కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారణ సమయంలో 2016 డిసెంబరు 5న జయలలిత మరణించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పుని సమర్థించింది. జయలలిత మరణించి ఆరేళ్లుకాగా ఆమె చెల్లించాల్సిన జరిమానా కట్టేందుకు ఎవరూ ముందుకురాలేదు. దీంతో ఆమె ఆస్తులు అమ్మి జరిమానా చెల్లించేందుకు చర్యలు చేపట్టారు. ఆమె ఇంట్లో అవినీతి నిరోధకశాఖ స్వాధీనం చేసుకున్న 28 కిలోల బంగారు నగలు, 800 కిలోల వెండి నగలు, వజ్రాల నగలను కోర్టులో అప్పగించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొబైల్ సేవల్లో అంతరాయం.. ఒక్కో కస్టమర్‌కు 5 డాలర్ల పరిహారం
శ్రీశైల మల్లికార్జునుడికి బంగారుపళ్లెం కానుక..ఎవరు ఇచ్చారంటే ??
మరణం ఎవరికైనా బాధాకరమే !! కన్నీరు పెట్టిస్తున్న వీడియో