నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి

Updated on: Jan 18, 2026 | 3:32 PM

సంగారెడ్డి ఓటర్లపై అలకబూనిన జగ్గారెడ్డి, తాను హర్ట్ అయ్యానని, ఇక జీవితంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయనని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. రాహుల్ గాంధీ ప్రచారం చేసినా తనను ఓడించారని, మేధావులే దీనికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, మున్సిపల్ ఎన్నికలకు మాత్రం అభ్యర్థులను ఖరారు చేస్తూ, ఓటర్లను ప్రలోభాలకు లొంగవద్దని హెచ్చరించారు.

సంగారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి, సంగారెడ్డి రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు. తాను హర్ట్ అయ్యానని, ఇక జీవితంలో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి ప్రచారం చేసినా తనను ఓడించడాన్ని ఆయన తీవ్ర అవమానంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఓటమికి సంగారెడ్డిలోని మేధావులే కారణమని ఆయన పరోక్షంగా ఓటర్లపై అలకబూనారు. అయితే, ఓవైపు రాజకీయ వైరాగ్యం ప్రకటిస్తూనే, మరోవైపు సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులను ఆయన ఖరారు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమంలోనే అభ్యర్థుల పేర్లను పబ్లిక్ మీటింగ్లో ప్రకటించారు.

మరిన్ని వీడియోల కోసం :

సీఎంను చిప్స్‌ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్‌ ఇదే!

అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!

ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంటే..

కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!