గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానించారు

Updated on: Dec 27, 2025 | 10:27 PM

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈ పథకం రద్దు వెనుక బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చే కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ ప్రభుత్వం "వన్ మ్యాన్ షో" నడుపుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. జనవరి 5 నుంచి మన్ రేగా బచావో అభియాన్ నిర్వహించనుంది.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరు మార్పుపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో నిర్ణయించారు. ఈ పథకం పేరు నుండి గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గ్రామీణ ప్రజలకు పని హక్కు కల్పించిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని, తద్వారా బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చాలని కేంద్రం చూస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

Gold Price Today: ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. శనివారం తులం ఎంతంటే..

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ… కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే

వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట