Watch Video: ‘నిరుద్యోగ యువత పక్షాన అసెంబ్లీని స్తంభింపజేస్తాం’.. మాజీ మంత్రి హరీష్ రావు..
తెలంగాణ నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ విషయంలో స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగఅవకాశాలు కల్పిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. అందుకుగానూ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు బాండుపేపరుపై సంతాకాలు చేసి ఇచ్చారని గుర్తు చేశారు. అప్పడు ఇచ్చిన బాండు పేపర్లు, చేసిన సంతకాలు ఏమైనాయని ఎద్దేవా చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న భట్టి విక్రమార్క 1:100 నిష్పత్తిలో పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేశారని తెలిపారు.
తెలంగాణ నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ విషయంలో స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగఅవకాశాలు కల్పిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. అందుకుగానూ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు బాండుపేపరుపై సంతాకాలు చేసి ఇచ్చారని గుర్తు చేశారు. అప్పడు ఇచ్చిన బాండు పేపర్లు, చేసిన సంతకాలు ఏమైనాయని ఎద్దేవా చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న భట్టి విక్రమార్క 1:100 నిష్పత్తిలో పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేశారని తెలిపారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు అలా పరీక్షలు నిర్వహించరు అని ప్రశ్నించారు. ఇదేనా కాంగ్రెస్ పనితీరు, పరిపాలన అని నిలదీశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని విద్యార్థుల తరుఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనా నిరుద్యోగుల గొంతును వినిపిస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ పై చర్చ చేపట్టి శాసనసభను స్తంభింపజేస్తామని చెప్పారు. నిరుద్యోగ యుతకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..