బీజేపీ దృష్టిలో వైసీపీ, టీడీపీ రెండూ ఒక్కటే.. ఏపీ రాజకీయాలపై ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Apr 26, 2023 | 3:57 PM

ఏపీ రాజకీయలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి సంబంధించినంత వరకు ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ వేర్వేరు కాదన్నారు. ఆ రెండింటిని బీజేపీ ఒకే దృష్టితో చూస్తోందని అభిప్రాయపడ్డారు.

ఏపీ రాజకీయలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి సంబంధించినంత వరకు ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ వేర్వేరు కాదన్నారు. ఆ రెండింటిని బీజేపీ ఒకే దృష్టితో చూస్తోందని అభిప్రాయపడ్డారు. ఏపీలోని మొత్తం 25 ఎంపీ స్థానాలు బీజేపీ వైపే ఉండటం దీనికి కారణమని విశ్లేషించారు.  ఏదో ఒక పార్టీ వైపు వెళ్లి తనకు దక్కే పూర్తి సంఖ్యను బీజేపీ ఎందుకు సగం చేసుకుంటుందని ప్రశ్నించారు. తనకు తెలిసినంత వరకు వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏపీలో ఇండిపెండెంట్‌గా వెళ్లొచ్చని, వైసీపీ, టీడీపీలతో కలిసే అవకాశం లేదన్నారు. జనసేన ముందుకు వస్తే ఆ పార్టీతో కలిసి బీజేపీ పోటీచేసే అవకాశం ఉందన్నారు.

దేశ దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాలు మొత్తం భారత దేశాన్ని బ్రతికిస్తున్నాయని ఉండవల్లి పేర్కొన్నారు. ఉత్తర భారతావనిలోని గుజరాత్, మహారాష్ట్ర మాత్రమే మిగులు రాష్ట్రాలుగా ఉన్నాయన్నారు. ఉత్తరాది రాష్ట్రాల నష్టాలను దక్షిణాది రాష్ట్రాలు మోయాల్సి వస్తోందన్నారు. దీన్ని ఇప్పుడే సరిగ్గా పరిష్కరించకపోతే.. భవిష్యత్తులో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య గొడవ రావడం ఖాయమన్నారు. అందుకే దేశంలోని లోక్‌సభ స్థానాల సంఖ్యను 800కు పెంచి.. 600 స్థానాలను ఉత్తరాదిలో.. మిగిలిన 200 స్థానాలను దక్షిణాదిలో ఉంచే అవకాశముందన్నారు.

Published on: Apr 26, 2023 03:57 PM