Wipes Shoes Video: భక్తుల బూట్లు తుడిచిన మాజీ సీఎం..! వైరల్ అవుతున్న వీడియో..
చేసిన పాపాలు పోగొట్టుకోడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు దాన ధర్మాలు చేస్తారు.. మరి కొందరు తీర్ధ యాత్రలు చేస్తారు.. కానీ ఇక్కడ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోడానికి బూట్లు తుడిచారు. ఎవరా మాజీ ముఖ్యమంత్రి.. ఆయనేం చేశారు..?
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ హరీశ్ రావత్ పాప ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ఓ గురుద్వారాలో భక్తుల బూట్లు తుడవడం, ప్రార్థనా మందిరాన్ని చీపురుతో శుభ్రపరచడం ద్వారా గతంలో తాను చేసిన వ్యాఖ్యల పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. గతవారం పంజాబ్‌లోని చండీగఢ్‌లో పర్యటించిన హరీశ్ రావత్, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ సహా ఐదుగురు నేతలను ఉద్దేశించి సిక్కుల పవిత్ర పదంతో పోల్చారు. ఈ పదం ఉపయోగించిన హరీశ్ రావత్ పై సిక్కుల మనోభావాలను దెబ్బతీశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
దాంతో వెంటనే తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన రావత్ క్షమాపణ చెప్పారు. అంతేకాక, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా గురుద్వారాలో కరసేవ చేస్తానని ప్రకటించారు. చెప్పినట్టుగానే సెప్టెంబర్ 3న ఉత్తరాఖండ్, ఉదంసింగ్ నగర్‌లోని నానక్‌మిట్టలో ఉన్న గురుద్వారాను సందర్శించి భక్తుల బూట్లు తుడిచారు. మందిర పరిసరాలను చీపురుతో శుభ్రం చేశారు. అనంతరం గురుద్వారాలో దైవ దర్శనం చేసుకున్నారు. దైవ సన్నిధిలో ఈవిధంగా తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లుగా హరీష్ రావత్ తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: డేంజర్ గా మారుతున్న వెదర్.. తెలుగు రాష్ట్రాల్లో అలెర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు: Heavy Rains Live Video.
Mahesh Babu Shoot Leak Video: బాలీవుడ్ స్టార్‌తో ప్రిన్స్ మహేష్ మూవీ..లీకైన షూట్ వీడియో..