Devaragattu Bunny Festival: కర్రలు లేచాయి.. తలలు పగిలాయి.. ఏ మాత్రం తగ్గని బన్ని ఉత్సవాల్లో హింస.. (వీడియో)

|

Oct 22, 2021 | 7:19 AM

కర్నూలు జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న బన్నీ ఉత్సవం రక్తసిక్తం అయింది. హొలగుంద మండలం దేవరగట్టులో ఏటా కర్రల సమరం నిర్వహించటం ఆనవాయితీ. ఈ క్రమంలో దసరా రోజు రాత్రి జరిగిన కర్రల సమరంలో హింస చెలరేగింది.

కర్నూలు జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న బన్నీ ఉత్సవం రక్తసిక్తం అయింది. హొలగుంద మండలం దేవరగట్టులో ఏటా కర్రల సమరం నిర్వహించటం ఆనవాయితీ. ఈ క్రమంలో దసరా రోజు రాత్రి జరిగిన కర్రల సమరంలో హింస చెలరేగింది. దాదాపు 100 మందికిపైగా గాయపడ్డారు. ఓ వర్గం వారిని మరో వర్గం అడ్డుకోవడం, ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకోవటంతో పదుల సంఖ్యలో మందికి గాయాలైయ్యాయి. క్షతగాత్రులను ఆదోనిలోని ఆసుపత్రికి తరలించారు.

దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండమీద మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్నీ ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్సవాల సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానిక నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు. గతంలో ఈ ఉత్సవాలను అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఈ ఏడాది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా.. వంద మందికిపైగా గాయపడ్డారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Navy Malabar Exercises: సముద్రంలో నౌకావిన్యాసాలు..! బ‌ల‌మైన సైనిక సంబంధాలే ల‌క్ష్యంగా.. (వీడియో)