Animal Viral Video: చెంబులో తల పెట్టిన పిల్లి..? సాయం చేయబోతే షాక్..! వైరల్ అవుతున్న వీడియో…
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నక్కలపల్లి గ్రామంలో ఓ చిరుత పిల్ల తల చెంబులో ఇరుక్కుపోయింది. బయటకు తీయడానికి నానా తిప్పలు పడుతోంది. అటుగా వెళ్తోన్న వైఎస్ఆర్టీపీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆ మూగజీవి అవస్థను చూసి చలించిపోయారు..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నక్కలపల్లి గ్రామంలో ఓ చిరుత పిల్ల తల చెంబులో ఇరుక్కుపోయింది. బయటకు తీయడానికి నానా తిప్పలు పడుతోంది. అటుగా వెళ్తోన్న వైఎస్ఆర్టీపీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆ మూగజీవి అవస్థను చూసి చలించిపోయారు.. తన వాహనాన్ని ఆపి దాని వద్దకు వెళ్లారు. తల చెంబులో ఇరుక్కుపోయి పిల్లి ఇబ్బంది పడుతోందని భావించిన కొండా రాఘవరెడ్డి.. దానికి సాయం చేద్దామనుకున్నారు. పిల్లికి సాయం చెద్దామని దగ్గరకు వెళ్లి దాన్ని చేతిలోకి తీసుకున్నారు. అప్పటికి గానీ అసలు విషయం తెలియలేదు. ఒక్కసారిగా చిరుతపులి పిల్ల కరవడంతో అవాక్కయ్యారు. అది పిల్లి కాదు చిరుతపులి పిల్ల అని అర్థమై కిందకు వదిలేశారు. ఆ పులి పిల్ల రాఘవరెడ్డి చేతిలో నుంచి దూకి పారిపోయింది. అది పులి పిల్ల అని తెలియగానే, కొండా రాఘవరెడ్డి తన అనుచరులు అక్కణ్నుంచి పరుగులు పెట్టారు. ఘటనపై స్థానిక పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమీప అటవీ ప్రాంతాల్లో పులి సంచారిస్తున్నట్లు అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. చిరుతతో పాటు దాని పిల్లలను కూడా పట్టుకోవటానికి అధికారులు రంగంలోకి దిగారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

