Andhra Pradesh: పొత్తులు.. ఎత్తులు..! ఎటూ తేల్చని బీజేపీ కోర్ కమిటీ.. అధిష్టానం ఏం తేల్చనుంది..
Andhra Pradesh Politics: పొత్తులు.. అవనిగడ్డలో వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ భేటీ అయింది. ఏపీలో పొత్తుల వ్యవహారంపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమాలోచనలు జరిపారు. పొత్తుల విషయంలో కోర్ కమిటీ ఎటూ తేల్చలేదు.
Andhra Pradesh Politics: పొత్తులు.. అవనిగడ్డలో వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ భేటీ అయింది. ఏపీలో పొత్తుల వ్యవహారంపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమాలోచనలు జరిపారు. పొత్తుల విషయంలో కోర్ కమిటీ ఎటూ తేల్చలేదు. పొత్తుల విషయంపై తమ జాతీయ నాయకత్వమే సమాధానం చెబుతుందన్నారు పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారని.. బీజేపీ అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెబుతుందని పురంధేశ్వరి పేర్కొన్నారు.
కాగా.. పురంధేశ్వరి తాజా కామెంట్లతో పొత్తుల అంశం.. ఇప్పుడు కేంద్ర నాయకత్వం చేతుల్లోకి వెళ్లింది. పొత్తులపై ఊగిసలాట ధోరణి కొనసాగిస్తుందో లేక త్వరలోనే దీనికి హైకమాండ్ తెర వేస్తుందో వేచి చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..