పాకెట్ రాజ్యాంగానికి ఫుల్ డిమాండ్‌.. రాహుల్ గాంధీ వల్లే డిమాండ్ పెరిగిందన్న ప్రచురణ సంస్థ డైరెక్టర్‌

|

Jun 18, 2024 | 8:35 PM

ఇటీవల లోక్​సభ ఎన్నికల ర్యాలీల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పలు చోట్ల ప్రదర్శించిన పాకెట్ రాజ్యాంగపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. దీంతో ఈ పాకెట్ ఎడిషన్​కు ఇప్పుడు డిమాండ్ ఏర్పడింది.ఈ పాకెట్ రాజ్యాంగ పుస్తకాలను ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో ప్రచురిస్తారు. నగరంలో సుమారు 80 ఏళ్ల చరిత్ర గల 'ఈస్టర్న్‌ బుక్‌ కంపెనీ' ప్రచురణకర్తలు గత పదిహేనేళ్లుగా ఈ పాకెట్‌ సైజు రాజ్యాంగ ప్రతులను ప్రచురిస్తున్నారు.

ఇటీవల లోక్​సభ ఎన్నికల ర్యాలీల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పలు చోట్ల ప్రదర్శించిన పాకెట్ రాజ్యాంగపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. దీంతో ఈ పాకెట్ ఎడిషన్​కు ఇప్పుడు డిమాండ్ ఏర్పడింది.ఈ పాకెట్ రాజ్యాంగ పుస్తకాలను ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో ప్రచురిస్తారు. నగరంలో సుమారు 80 ఏళ్ల చరిత్ర గల ‘ఈస్టర్న్‌ బుక్‌ కంపెనీ’ ప్రచురణకర్తలు గత పదిహేనేళ్లుగా ఈ పాకెట్‌ సైజు రాజ్యాంగ ప్రతులను ప్రచురిస్తున్నారు. లోక్​సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ విస్తృతంగా తీసుకెళ్లడం వల్లే ప్రజల్లో ఆసక్తి పెరిగిందని ఈబీసీ ప్రచురణ సంస్థ డైరెక్టర్‌ సుమీత్‌ మాలిక్‌ అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇప్పుడు ఈ పాకెట్ ఎడిషన్​ కోసం ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు. ఈ సైజు రాజ్యాంగ కాపీల ప్రచురణకు మొదట సుప్రీంకోర్టు న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ తమను ప్రోత్సహించినట్లు తెలిపారు. ఆయన సూచనతోనే ఈ సైజు రాజ్యాంగ పుస్తకాల ప్రచురణ మొదటలు పెట్టినట్లు చెప్పారు. ఈ ప్రచురణను 2009లో ప్రారంభించి, ఇప్పటి వరకు 16 ఎడిషన్లు ప్రచురించినట్లు సుమీత్ తెలిపారు. ఈ సైజు కాపీలను ఇప్పటి వరకు ఎక్కువగా న్యాయవాదులు, న్యాయమూర్తులు కొంటూ వచ్చారని ఇతరులకు కానుకగా ఇచ్చేందుకు కూడా కొనేవారని అన్నారు. రామ్​నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినపుడు ప్రధాని మోదీ సైతం ఇదే పుస్తకాన్ని బహూకరించారట. ఈ సైజు పుస్తకంలో ఫాంట్ సైజు విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు సుమీత్‌ చెప్పారు. రాజ్యాంగ అధికరణాల సంఖ్యలన్నీ ఎరుపు రంగులో, సమాచారం నల్లరంగులో ఉండేలా పలుచనైన బైబిలు పేపరుపై దీన్ని ప్రచురించామని అన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందే భారత్ స్లీపర్​ రెడీ.. త్వరలో పట్టాలపై పరుగులు

డీజే సిద్ధార్థ్‌కు డ్రగ్స్‌ పాజిటివ్‌.. ఎవరీ సిద్దార్థ్‌ ??

ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా

ఆలస్యంగా వచ్చారో.. అంతే సంగతులు… కేంద్రం కొత్త రూల్స్‌

ప్రపంచ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన తెలుగు తేజం