Revanth Reddy Live: తెలంగాణలో సీఎం రేవంత్ టీమ్ సిద్ధమైంది. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో.. వేలాది మంది అభిమానులు, కార్యకర్తల కోలాహలం మధ్య సీఎంగా రేవంత్ ప్రమాణం చేశారు. ఆయనతో పాటు మరో 11మంది నేతలతోనూ.. మంత్రులుగా ప్రమాణం చేయించారు గవర్నర్ తమిళిసై. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కకు అవకాశం కల్పించింది అధిష్టానం. ఆయనతో పాటు దామోదర్ రాజనర్సింహా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్.. మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ ప్రజలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు.
ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ రెడ్డి సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కెబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రులు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. లైవ్ లో మాట్లాడుతున్నారు.. వీక్షించండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..