BRS Manifesto: ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016కు పెంపు
కాంగ్రెస్, బీజేపీతో పోలిస్తే అధికార పార్టీ బీఆర్‌ఎస్సే జోరుమీదుంది. వార్ వన్ సైడ్ చేయాలనే లక్ష్యంతో.. ఎన్నికల కదన రంగంలోకి దిగుతున్నారు గులాబీ బాస్. తాజాగా బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారు.. హుస్నాబాద్ సభతో సమరశంఖం పూరించేందుకు రెడీ అవుతున్నారు సీఎం కేసీఆర్. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి...
ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో తిరిగి ఏర్పడేది తమ ప్రభుత్వమేనని BRS అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. వచ్చే నెల జరగనున్న ఎన్నికలకు సంబంధించి BRS మ్యానిఫెస్టోను కేసీఆర్ విడుదల చేశారు. అధికారంలోకి రాగానే ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలన్ని కొనసాగిస్తామని ప్రకటించడంతో పాటు కొత్తగా మరిన్ని పథకాలు ప్రకటించారు.
ఆసరా పెన్షన్లను ఐదు వేల రూపాయలకు పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఒకేసారి కాకుండా దశలవారీగా ఉంటుందని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మార్చి- ఏప్రిల్‌లో పెన్షన్ మొత్తాన్ని 3 వేలకు పెంచుతామని, ఆ తర్వాత దాన్ని ప్రతీ సంవత్సరం 500 రూపాయల చొప్పున ఐదో సంవత్సరం వచ్చే నాటికి 5వేలకు పెంచుతామని ప్రకటించారు. అలాగే దివ్యాంగులకిస్తున్న పెన్షన్ మొత్తాన్ని 6వేలకు పెంచుతామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ మొత్తాన్ని 5వేలకు ఆ తర్వాత ఏటా 300 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోతామని ప్రకటించారు. రైతుబంధు పథకం కింద ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని 16 వేలకు పెంచుతామని మరో వరాన్ని కేసీఆర్ ప్రకటించారు. తొలి సంవత్సరం 12వేలకు ఆ తర్వాత దశలవారీగా పెంపు ఉంటుందని హామీ ఇచ్చారు.
అర్హులైన మహిళలకు ప్రతీ నెల 3000 రూపాయలు గౌరవభృతి అందించే సౌభాగ్యలక్ష్మి పథకాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడతామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే తెలంగాణలోని రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ అన్నపూర్ణ పేరుతో ఈ పథకాన్ని చేపడతామని వెల్లడించారు. పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల నుంచి పేదలకు ఉపశమనం కల్పించేందుకు అర్హులైన పేద కుటుంబాలకు 400 రూపాయలకే సిలిండర్ అందిస్తామని మరో హామీ ఇచ్చారు. ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే చర్యల్లో భాగంగా అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ గరిష్ఠ పరిమితిని 15 లక్షలకు పెంచుతామని కేసీఆర్ తెలిపారు.
అధికారంలోకి వస్తే కొత్త కేసీఆర్ బీమా – ప్రతీ ఇంటికీ ధీమా పేరుతో కొత్త పథకాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలకు బీమా ప్రీమియంను ప్రభుత్వమే కడుతుందని, LIC ద్వారా దీన్ని అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో పటిష్ఠంగా అమలవుతున్న రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థలోకి అగ్రవర్ణ పేదలకు కూడా అవకాశం కల్పిస్తామని KCR ప్రకటించారు. అగ్రవర్గ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పాత పెన్షన్ విధానం అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని KCR ప్రకటించారు. ఆ నివేదిక ఆధారంగా ఉద్యోగుల పెన్షన్‌పై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అసైన్డ్ భూములపై ఉన్న ఆంక్షలు తొలగిస్తామని KCR భరోసా ఇచ్చారు. అలాగే మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్ మొత్తాన్ని పెంచుతామని ప్రకటించారు. అనాథ పిల్లల కోసం కూడా ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..