CM KCR Medak Public Meeting: సీఎం కేసీఆర్ మెదక్ టూర్.. స్పీడ్ పెంచిన గులాబీ దళపతి..
CM KCR Medak Public Meeting: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ అధికార పార్టీ స్పీడ్ పెంచింది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఎన్నికల కథనరంగంలోకి దిగారు. అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు చంద్రశేఖరుడు. ప్రత్యర్థుల ఊహకందని విధంగా కార్యక్రమాలు రూపొందిస్తూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల సమర శంఖారావం పూరించిన కేసీఆర్.. జిల్లాల వారీగా వరుస సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ మెదక్ జిల్లాలో..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ అధికార పార్టీ స్పీడ్ పెంచింది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఎన్నికల కథనరంగంలోకి దిగారు. అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు చంద్రశేఖరుడు. ప్రత్యర్థుల ఊహకందని విధంగా కార్యక్రమాలు రూపొందిస్తూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల సమర శంఖారావం పూరించిన కేసీఆర్.. జిల్లాల వారీగా వరుస సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. కలెక్టర్ కార్యాలయం.. పోలీసు కార్యాలయంతో పాటు.. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఆ తరువాత మెదక్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Published on: Aug 23, 2023 03:54 PM