CM KCR Live: ధరణి పోతే పట్టాలు ఇవ్వడానికి 6 నెలలు పడుతుంది: సీఎం కేసీఆర్

| Edited By: Ram Naramaneni

Jun 30, 2023 | 4:37 PM

ఆసిఫాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన కేసీఆర్.. జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను సీట్లో కూర్చొబెట్టారు. అనంతరం కలెక్టరేట్ ప్రారంభించారు. ఆపై ప్రగతి నివేదన సభ వేదికకు చేరుకుని ప్రసంగించారు.

ఆసిఫాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన కేసీఆర్.. జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను సీట్లో కూర్చొబెట్టారు. అనంతరం కలెక్టరేట్ ప్రారంభించారు. ఆపై ప్రగతి నివేదన సభ వేదికకు చేరుకుని ప్రసంగించారు. గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ చేశారు.28 జిల్లాలు, 295 మండలాలు, 2 వేల 845 గ్రామ పంచాయతీల పరిధిలో ఫారెస్ట్‌ రైట్స్‌ కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. 12 లక్షల 49 వేల 296 ఎకరాలకు సంబంధించి 4 లక్షల 14 వేల 353 క్లెయిమ్స్‌ను వివిధ స్థాయిలో పరిశీలించి, 28 జిల్లాల పరిధిలో 4 లక్షల 6 వేల 369 ఎకరాల భూమిపై లక్షా 51 వేల 146 మంది లబ్ధిదారులు పోడు పట్టాలు పొందేందుకు అర్హులుగా గుర్తించారు. పంపిణీ చేసే పోడు భూములకు ఈ వానకాలం పంట నుంచే రైతుబంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దీంతో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య మరో లక్షా 51 వేలు పెరగనుంది. 4 లక్షల ఆరు ఎకరాలకు రైతుబంధు కింద ప్రభుత్వంపై ఏటా 406 కోట్ల రూపాయల భారం పడనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..

Published on: Jun 30, 2023 02:20 PM