CM Chandrababu: దేశం కోసం మోదీ కూడా ఎంతో కష్టపడుతున్నారు

Edited By:

Updated on: Nov 11, 2025 | 5:00 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశం కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆంధ్రప్రదేశ్‌లో ముందుగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. లోకేష్‌ పరిశ్రమల ఆకర్షణలో, పవన్‌ కళ్యాణ్‌ సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అమరావతిలో తొలి క్వాంటం కంప్యూటింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

దేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎంతో కష్టపడుతున్నారని కొనియాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వం ఏ పాలసీ తీసుకొచ్చినా, దానిని వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చి అమలు చేసే బాధ్యతను తాను తీసుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. కేంద్రం రూపొందించిన విధానాలను రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముందు వరుసలో నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా యువ నాయకుడు లోకేష్‌ పనితీరును సీఎం చంద్రబాబు ప్రశంసించారు. పరిశ్రమల స్థాపన కోసం పట్టువదలకుండా లోకేష్‌ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. దేశంలోనే మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్‌ సెంటర్‌ అమరావతిలో ఏర్పాటు కాబోతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Brahmos missiles: మన బ్రహ్మోస్‌కు మస్తు గిరాకీ.. కొనేందుకు క్యూ కడుతున్న దేశాలు

H-1B Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌

మీరు కొన్న బంగారం ఒరిజనలేనా ?? గుంటూరులో నకిలీ హాల్ మార్క్ దందా

పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష

ప్రేమించలేదని పగబట్టి.. జైలు పాలైన లేడీ కిలాడీ