Chandrachud: సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆయుష్‌ యోగా, హోలిస్టిక్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు.

Updated on: Feb 26, 2024 | 10:26 AM

సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయుష్‌ హోలిస్టిక్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్షణం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తాను సీఐగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం కృషి చేశానన్నారు. తాను ఆయుర్వేదం, సంపూర్ణ జీవనశైలిని సమర్థిస్తానని అన్నారు.

సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయుష్‌ హోలిస్టిక్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్షణం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తాను సీఐగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం కృషి చేశానన్నారు. తాను ఆయుర్వేదం, సంపూర్ణ జీవనశైలిని సమర్థిస్తానని అన్నారు. సుప్రీంకోర్టులో 2 వేల మందికిపైగా ఉద్యోగులు ఉన్నారని.. న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులే కాకుండా సిబ్బంది జీవన విధానాన్ని సైతం పరిశీలించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేసిన ఘటనను సీజేఐ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరోనా సమయంలో తన పరిస్థితి ఘోరంగా ఉండేదని.. ఆ సమయంలో ప్రధాని మోదీ ఫోన్‌ చేసి అంతా సర్దుకుంటుందని తెలిపారన్నారు. ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకుని ఆయుష్‌ వైద్యుడు, ఆయుష్‌ కార్యదర్శితో మాట్లాడేలా ఏర్పాట్లు చేశారని.. మందులు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. కొవిడ్‌ సమయంలో ఆయుష్‌ మెడిసిన్‌ తీసుకున్నానని తెలిపారు. కోర్టు ఉద్యోగులు, వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. వారికి న్యాయమూర్తులతో సమానంగా సౌకర్యాలు లేవన్నారు. న్యాయమూర్తులు, కుటుంబ సభ్యులు, ఉద్యోగులంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తాను యోగా చేస్తానని.. ఐదు నెలలుగా వీగన్‌ డైట్‌ను ఫాలో అవుతున్నానని ఇకపై అదే కొనసాగిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయుష్‌ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో పాటు వైద్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..