Telangana: జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..

|

May 02, 2024 | 5:07 PM

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు. గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలో ఆయన ప్రచారం చేశారు. మద్దతుదారులు, కమలంపార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో రఘునందన్‌రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు‌. అబద్ధాన్ని రోజూ చెబుతూ నిజం చేయాలని సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు. గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలో ఆయన ప్రచారం చేశారు. మద్దతుదారులు, కమలంపార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో రఘునందన్‌రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు‌. అబద్ధాన్ని రోజూ చెబుతూ నిజం చేయాలని సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. గడిచిన పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని ప్రధాని మోదీ నాయకత్వంలో పేదలను ఆదుకున్నామన్నారు. సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు.  వీలైతే కొత్తగా రిజర్వేషన్లు ఇచ్చి పేదలను ఆదుకున్నామే తప్ప.. బీజేపీ ఎప్పుడూ భారత రాజ్యాంగాన్ని అగౌరవపరచలేదన్నారు.

కేసీఅర్ వంద అబద్ధాలు ఆడితే రేవంత్ రెడ్డి వెయ్యి అబద్ధాలు ఆడుతున్నారన్నారు మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి. కేసీఅర్ బద్నాం కావడానికి పదేళ్లు పడితే రేవంత్ రెడ్డి బద్నాం కావడానికి ఆర్నెల్లు కూడా పట్టలేదన్నారు రఘునందన్‌రావు. ఇప్పటికే భారత రాజ్యాంగాన్ని 126 సార్లు సవరిస్తే అందులో దాదాపు 100 సార్లు భారత రాజ్యాంగాన్ని సవరించింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. దళిత సామాజికవర్గాన్ని సమాజం నుంచి వేరు చేసేందుకు, గంపగుత్తగా వాళ్ల ఓట్లన్నీ వేయించుకునేందుకు భారత రాజ్యాంగాన్ని మారుస్తారన్న అసత్య ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తోందని ఫైర్ అయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..