టిడిపిపై మండిపడిన బీజేపీ నేతలు.. పొత్తు ధర్మం పాటించడం లేదని ఆగ్రహం..

| Edited By: Srikar T

Apr 05, 2024 | 3:08 PM

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీజేపీ, టీడీపీ మధ్య విభేదాలు బయట పడ్డాయి. కూటమిలో భాగంగా ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తీరుపై స్థానిక బీజేపీ కన్వీనర్ మురహరి రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరులో జరిగిన ప్రజాగళం చంద్రబాబు పర్యటనకు ఉమ్మడి అభ్యర్థి నుండి తామకు ఎటువంటి సమాచారం లేదని తెలిపారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీజేపీ, టీడీపీ మధ్య విభేదాలు బయట పడ్డాయి. కూటమిలో భాగంగా ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తీరుపై స్థానిక బీజేపీ కన్వీనర్ మురహరి రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరులో జరిగిన ప్రజాగళం చంద్రబాబు పర్యటనకు ఉమ్మడి అభ్యర్థి నుండి తామకు ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. కానీ జయనాగేశ్వర్ రెడ్డి మాత్రం సమాచారం ఇచ్చారని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని అది అయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. బీజేపీ మీద బురద జల్లకుండా ఉమ్మడి అభ్యర్థిగా అవకాశం వచ్చిన వ్యక్తి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఇలా తప్పుడు మాటలు మాట్లాడకూడదన్నారు. ఎమ్మిగనూరు అభ్యర్థి విషయంలో మార్పులు జరిగితే తాము పోటీకి సిద్ధంగా ఉన్నామని, ఒక వేళ బీజేపీ పార్టీ ఫ్రెండ్లీ కంటెస్ట్‎గా పోటీ చేయమన్న సిద్ధమని బీజేపీ కన్వీనర్ మురహరి రెడ్డి అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడి క్లిక్ చేయండి..

Published on: Apr 05, 2024 02:48 PM