బిహార్ ఎన్నికల్లో హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్
బిహార్ ఎన్నికల్లో హెలికాప్టర్లకు డిమాండ్ అమాంతంగా పెరిగింది. ప్రచారం కోసం పార్టీలు భారీగా హెలికాప్టర్లు బుక్ చేస్తున్నాయి. బీజేపీ-జేడీయూ కూటమి 12 కంటే ఎక్కువ హెలికాప్టర్లు బుక్ చేయగా, మహాకూటమి 5 హెలికాప్టర్లను ఉపయోగించనుంది. ఒక గంటకు రెంట్ లక్ష రూపాయల నుండి నాలుగు లక్షల రూపాయల వరకు ఉన్నాయి.
బిహార్‌లోని రాబోయే ఎన్నికల నేపథ్యంలో హెలికాప్టర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రచార కార్యక్రమాల కోసం రాజకీయ పార్టీలు రికార్డు స్థాయిలో హెలికాప్టర్లను బుక్ చేస్తున్నాయి. 2020 ఎన్నికలతో పోలిస్తే ఈసారి హెలికాప్టర్ల బుకింగ్స్ మూడు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ మరియు జేడీయూ కలిసి 12 కంటే ఎక్కువ హెలికాప్టర్లను బుక్ చేసుకున్నాయి. జేడీయూ నేతలు రోజుకు రెండు హెలికాప్టర్లు ఉపయోగించనున్నారు. విపక్ష మహాకూటమి ఐదు హెలికాప్టర్లను ఉపయోగించనుంది. సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ల గంటకు రెంట్ లక్ష నుంచి రెండు లక్షల వరకు ఉండగా, డబుల్ ఇంజిన్ హెలికాప్టర్ల రెంట్ మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఉంది. ప్రతిరోజూ పార్టీలు దాదాపు 11 లక్షల రూపాయలు హెలికాప్టర్లకు ఖర్చు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో హెలికాప్టర్లు బిహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూరియా కోసం పంపిణీ కేంద్రాల వద్దే రైతుల నిద్ర
Onion Rates: ఉల్లి ధరపై.. ఆగని రైతుల లొల్లి
