దేశవ్యాప్తంగా మళ్లీ సంక్షేమ పథకాలపై రచ్చ రచ్చ జరుగుతోంది. అటు పార్టీల మధ్య మాటలయుద్ధం.. ఇటు సుప్రీంకోర్టులో వాదనలతో ఉచిత పథకాలపై చర్చ మొదలైంది. పేదలకు అందే సంక్షేమ పథకాలు రద్దు చేసే కుట్ర జరుగుతుందని రాష్ట్రాలు అంటే.. ఉచితం పేరుతో పంచే పథకాలు దేశ భవిష్యత్తును అంధకారం చేస్తాయంటున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఏది ఉచితం.. మరేది సంక్షేమం తేల్చడానికి కమిటీ వేయాలని సూచించిన సుప్రీంకోర్టు విసృత చర్చ జరగాలంటోంది.