Big News Big Debate: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఐటీ సోదాలు.. చిత్రహింసలు పెట్టారంటూ మంత్రి మల్లారెడ్డి ఆరోపణలు
ఐటీ రెయిడ్స్‌లో హ్యాట్రిక్ నాదే అంటున్న మల్లారెడ్డి అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. 300 మంది పోలీసులతో వచ్చిన 6వందల మంది అధికారులు నానా చిత్రహింసలు పెట్టారన్న మంత్రి మల్లారెడ్డి.. కేవలం కక్షతోనే ఇదంతా చేశారంటున్నారు.
ఇంతకాలం మనకు తెలిసిన ఐటీ సోదాలు వేరు… కానీ మల్లారెడ్డి మాత్రమే డిఫరెంట్ వాయిస్‌లో కొత్తగా చెబుతున్నారు. గతంలోఅనుభవం ఉంది కానీ ఇంత దారుణంగా లేదంటూ ఐటీ అధికారులపై షాకింగ్ అలిగేషన్స్ చేశారు తెలంగాణ మంత్రి. దర్యాప్తు సంస్థలు ముఖ్యంగా ఐటీ శాఖ ఆధారాలుంటేనే రెయిడ్స్ చేస్తుంది… చిత్రహింసలు కూడా పెడుతుందని బాధ్యత కలిగిన మంత్రి అంత ఈజీగా చెబుతారా.. నిజంగా చట్టంలో లేని థర్డ్ డిగ్రీలు.. మానసిక వేధింపులకు అధికారులు పాల్పడతారా.. ఏమో మంత్రి మల్లారెడ్డి అయితే ఒకటికి రెండుసార్లు బలంగా చెబుతున్నారు. మంత్రి మాటల ప్రభావంతో ఈడీ, ఐటీ సోదాలపై సరికొత్త డిమాండ్లు, ఓపెన్ డిబేట్లు తెరమీదకొస్తున్నాయి.
Published on: Nov 24, 2022 07:00 PM
వైరల్ వీడియోలు
Latest Videos