Big News Big Debate: కేంద్ర సంస్థల దూకుడు.. దాడులు ఊహించినవే అంటున్న టీఆర్ఎస్ నేతలు….లైవ్ వీడియో
దర్యాప్తు సంస్ధలు తమ పని తాము చేసుకుపోతున్నాయి. కానీ రాజకీయ పార్టీల మాత్రంవాటి చుట్టూనే రాజకీయం చేస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న కేంద్ర సంస్థల దాడులు ఊహించినవేనని..
దర్యాప్తు సంస్ధలు తమ పని తాము చేసుకుపోతున్నాయి. కానీ రాజకీయ పార్టీల మాత్రంవాటి చుట్టూనే రాజకీయం చేస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న కేంద్ర సంస్థల దాడులు ఊహించినవేనని.. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ ఇలా టార్గెట్‌గా దాడులు చేయడం సరికాదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు మంత్రి తలసాని. మరోవైపు ఎమ్మెల్యేల కోనుగోళ్ల వ్యవహారంలో విచారణలో స్పీడు పెంచిన సిట్ ఢిల్లీలోని బీఎల్ సంతోష్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చింది. విచారణు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. సిట్ దర్యాప్తు నిబంధనల ప్రకారం జరగడం లేదని.. ఫామ్‌హౌస్ కేసులో సిట్ దర్యాప్తు అంశాలు లీక్ కావడం ఏంటని ప్రశ్నిస్తోంది బీజేపీ. లుక్‌ఔట్ నోటీసులంటూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలుపెట్టిన TRS నేతలపై చర్యలు తీసుకోవాలంటున్నారు పార్టీ నాయకులు.