AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో హీటెక్కిన రాజకీయాలు.. బలప్రదర్శనకు సిద్ధమైన బీఆర్ఎస్, బీజేపీ..(Video)

Telangana: తెలంగాణలో హీటెక్కిన రాజకీయాలు.. బలప్రదర్శనకు సిద్ధమైన బీఆర్ఎస్, బీజేపీ..(Video)

Ravi Kiran
|

Updated on: Jan 10, 2023 | 7:00 PM

Share

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ బలగాలతో మోహరిస్తున్నాయి. మిషన్‌ 90 పేరుతో ఇప్పటికే యాక్షన్‌లోకి దిగిన భారతీయ జనతా పార్టీ మరోసారి ప్రధానమంత్రి అధికారిక పర్యటనకు కూడా పొలిటికల్‌ టచ్‌ ఇస్తోంది.



ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ బలగాలతో మోహరిస్తున్నాయి. మిషన్‌ 90 పేరుతో ఇప్పటికే యాక్షన్‌లోకి దిగిన భారతీయ జనతా పార్టీ మరోసారి ప్రధానమంత్రి అధికారిక పర్యటనకు కూడా పొలిటికల్‌ టచ్‌ ఇస్తోంది. అటు వన్‌ షాట్‌ టూ బర్డ్స్‌ అంటూ బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్‌ ఆవిర్భావసభ గ్రాండ్‌ సక్సెస్‌ చేసి సత్తా చాటాలనుకుంటోంది BRS. రెండు రోజుల గ్యాప్‌ లో జరిగే రెండు భారీ ఈవెంట్ల నేపథ్యంలో పార్టీ నేతల మధ్య సవాళ్లు కూడా అంతే స్ట్రాంగ్‌గా నడుస్తున్నాయి.

ఢిల్లీ పీఠం లక్ష్యంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్‌ పార్టీ ఆవిర్భావ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించి సత్తా చాటాలనుకుంటున్నారు కేసీఆర్‌. 5లక్షల మందితో సభ సక్సెస్‌ చేసి చరిత్ర సృష్టిస్తామంటున్నారు ఆ పార్టీ నాయకులు. తెలంగాణ మాత్రమే కాదు ఏపీ, చత్తీస్‌ఘఢ్‌ నుంచి కూడా జనసమీకరణకు పక్కాగా ప్లాన్‌ చేస్తున్నారు. అటు ప్రధాని 19న అధికారిక పర్యటన ఫిక్స్‌ అయింది. సరిగ్గా ఇదే సమయంలో కేసీఆర్‌ ఖమ్మం సభ ప్రకటన రావడంతో నరేంద్రమోదీ మీటింగ్‌కు కూడా పొలిటికల్‌ కలర్స్‌ అద్ది జనసమీకరణతో బలప్రదర్శన చేయాలనుకుంటోంది బీజేపీ. ఇదే కాదు కేసీఆర్ సభ రోజే భారీగా చేరికలతో బీఆర్ఎస్‌ పార్టీకి షాకిచ్చే ఆలోచనలో ఉంది బీజేపీ.