Big News Big Debate: బటన్ పే చర్చ / రచ్చ.. ఎవరి బటన్ ఎవరు నొక్కుతున్నారు.? వీడియో.
రైతు భరోసాపై వైసీపీ చేస్తున్న ప్రచారమేంటి.? బీజేపీ నేతల అభ్యంతరాలేంటి..? ఎవరి బటన్ ఎవరు నొక్కుతున్నారు..? పథకాల్లోనూ రాజకీయ కోణమేనా..?
మనీ ఎవరిది.. ప్రచారం మరెవరిది.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. పథకాలకు నిధులు మావి… ప్రచారం మీదా అంటూ YCPపై కాషాయం పార్టీ కస్సుమంటోంది. అయితే కేంద్రసాయంతో పాటు రాష్ట్రం అంతకంటే ఎక్కువే ఇస్తున్నాం కదా.. అని వైసీపీ రియాక్ట్ అవుతోంది. హౌసింగ్ నుంచి రేషన్ దాకా రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలకు నిధులన్నీ మావే అంటోంది బీజేపీ. ప్రచారం మాత్రం వైసీపీ చేసుకుంటుందని బీజేపీ నేతలు అంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఇంతకీ ఎవరి బటన్ ఎవరు నొక్కుతున్నారు.రాష్ట్రంలోని 52 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లోకి 11వందల కోట్లు జమ చేశారు సీఎం జగన్. దీనిని వైసీపీ ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. అయితే నిధులు ఇచ్చింది కేంద్రం… విడుదల చేసింది పీఎం అయితే.. ఏపీలో వైసీపీ ప్రచారమేంటని ప్రశ్నిస్తోంది బీజేపీ. అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు? చేయని పెళ్లికి శుభలేఖలు ఎందుకు? అని ప్రశ్నించారు బీజేపీ నేత సత్యకుమార్. ప్రధాని మోడీ నిజమైన బటన్ నొక్కి.. రాష్ట్రంలోని 52 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి వెయ్యి కోట్లు జమ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తి బటన్ ఎవరి కోసం అంటూ ప్రశ్నించారు. అటు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పీఎం కిసాన్ యోజన కార్యక్రమాన్ని మోడీ సర్కారు ఘనతగా పేర్కొంటూ అంతకుముందు ట్వీట్ చేశారు. దీనిని అనుకూలంగా మలుచుకున్న బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు… భరోసా ఒక్కటే కాదు.. మొత్తం 29 పథకాల కింద రాష్ట్రంలోని రైతులకు మోదీ మేలు చేస్తున్నారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ ట్యాగ్ చేస్తూ మరీ కామెంట్‌చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..