Big News Big Debate: రాజ్‌భవన్‌ Vs ప్రగతిభవన్‌.. మరోసారి ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన గవర్నర్‌

|

Jun 10, 2022 | 7:34 PM

తెలంగాణలో ఈ మధ్య జరుగుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నామని, ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గ్యాంగ్ రేప్ ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు పట్టించుకోలేదని గవర్నర్​ అసంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై మరోసారి ఘాటైన వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. KCR ప్రభుత్వంపైనే డైరెక్ట్‌ అటాక్‌ చేశారు. రాజ్‌భవన్‌ని, మహిళా గవర్నర్‌ని గౌరవించాల్సిందే అంటూ నొక్కి చెప్పారు. అటు జుబ్లీహిల్స్‌ పబ్‌లో మైనర్‌ బాలిక రేప్‌ ఘటనపైనా గవర్నర్‌ గరంగరంగా మాట్లాడారు. అంతే వేగంగా దర్బార్‌ కాదు… పొలిటికల్‌ దర్బార్‌ అంటూ అధికారపార్టీ నుంచి స్ట్రాంగ్‌ కౌంటర్లు కూడా పడ్డాయి. అయితే చిత్రంగా కాంగ్రెస్లో దీనిపై భిన్నస్వరాలున్నాయి.. ఒకరు తప్పేముంది అంటే.. మరొకరు తప్పుపడుతున్నారు.

Published on: Jun 10, 2022 07:31 PM