Watch Video: రజనీకాంత్ కామెంట్స్‌పై ఏపీలో కొనసాగుతున్న రాజకీయ రచ్చ.. ఇంతకీ సూపర్ స్టార్ ఏమన్నారు..?

Watch Video: రజనీకాంత్ కామెంట్స్‌పై ఏపీలో కొనసాగుతున్న రాజకీయ రచ్చ.. ఇంతకీ సూపర్ స్టార్ ఏమన్నారు..?

Janardhan Veluru

|

Updated on: May 01, 2023 | 12:03 PM

తమిళ సూపర్ స్టార్  రజనీకాంత్ వ్యాఖ్యలపై ఏపీలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. రోజులు గడిచినా పొలిటికల్‌ హీట్‌ మంటపుట్టిస్తూనే ఉంది. NTR శతజయంతి వేడుకల్లో చంద్రబాబును ఉద్దేశించి రజనీకాంత్ చేసిన కామెంట్స్.. ఈ రాజకీయ రచ్చకు కారణమయ్యింది. 

తమిళ సూపర్ స్టార్  రజనీకాంత్ వ్యాఖ్యలపై ఏపీలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. రోజులు గడిచినా పొలిటికల్‌ హీట్‌ మంటపుట్టిస్తూనే ఉంది. NTR శతజయంతి వేడుకల్లో చంద్రబాబును ఉద్దేశించి రజనీకాంత్ చేసిన కామెంట్స్.. ఈ రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. చంద్రబాబును విజనరీ లీడర్‌గా రజనీకాంత్‌ ప్రశంసల జల్లు కురిపించడంపై అధికార వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వంపై రజనీకాంత్‌ చిన్న విమర్శ చేయలేదని.. ఎవరినీ చిన్న మాట కూడా అనలేదని చంద్రబాబు తాజాగా ట్వీట్‌ చేశారు. రజనీకాంత్‌పై వైసీపీ నాయకులు అసభ్యకర విమర్శలతో దాడి చేయడాన్ని టీడీపీ అధినేత తప్పుపట్టారు.

అసలే ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య ఉప్పు నిప్పుగా ఉంది రాజకీయం. రెండు పక్షాలకు అస్సలు పడటం లేదు. ఇలాంటి తరుణంలో NTR శతజయంతి వేడుకలకు వచ్చిన రజనీకాంత్‌.. ఆ సభలో చంద్రబాబును ఉద్దేశించి చేసిన కామెంట్స్‌తో అధికార పార్టీకి టార్గెట్‌ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు స్పందించడంతో ఆ రచ్చ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఇంతకీ NTR శతజయంతి సభలో రజనీకాంత్‌ ఏమన్నారు..? దానికి వైసీపీ నేతలు ఎలా రియాక్ట్‌ అయ్యారో ఇప్పుడు చూద్దాం..

Published on: May 01, 2023 12:01 PM