Andhra Pradesh: మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్‌.

|

Dec 28, 2024 | 7:26 PM

ఆంధ్రప్రదేశ్‌ నిన్న మొన్నటి వరకు గుంతల రోడ్లకు కేరాఫ్‌గా మారింది. గ్రామాల్లోనే కాదు నగరాల్లోని ప్రధాన రహదారులు సైతం గుంతల మయమై దర్శనమిచ్చాయి. వాహనదారులు ఎందరో ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గత ప్రభుత్వం ప్రజల గోడును పట్టించుకోలేదు. కొత్త రోడ్లు కాదుకదా.. కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు.

ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల కష్టాలు తీర్చే దిశగా రోడ్లపై ఫోకస్‌ పెట్టింది. ‘పల్లె పండుగ’ పేరుతో ఊరూవాడా సీసీ రోడ్లు, కాలువలు, తారు రోడ్ల నిర్మాణాలు చేపడుతోంది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం రోడ్లను నిర్మాణానికి శ్రీకారం చుట్టుంది మన్యంలోని గ్రామాలకూ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలు రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు అరకులోయ నియోజకవర్గంలోని హుకుంపేట మండలంలో గూడ రోడ్డు నుంచి మర్రిపుట్టు మీదుగా సంతబయలు వరకు 2 కి.మీ మేర తారు రోడ్డు నిర్మించారు. దీంతో ఆ గిరిజనుల ఆనందానికి అవధుల్లేవు. పచ్చటి అడవిలో నల్లగా మెరిసిపోతున్న రోడ్లను ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తిచేసినందుకు ఆ ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.