Watch Video: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై స్పెషల్‌ ఫోకస్‌.. కేంద్ర మంత్రితో పురంధేశ్వరి భేటీ..

|

Jun 26, 2024 | 8:10 PM

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ఏపీ బీజేపీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. అందులో భాగంగా.. ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి సారథ్యంలోని పలువురు నేతల బృందం ఢిల్లీలోని పలు శాఖల మంత్రులను కలిశారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ యాక్షన్‌ ప్లాన్‌పై పురంధేశ్వరి టీమ్‌ సుదీర్ఘంగా చర్చించింది. స్టీల్‌ ప్లాంట్‌ను లాభాల బాటలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు.. అవసరమైన అంశాలతో కుమారస్వామికి వినతిపత్రం అందజేసింది పురంధేశ్వరి బృందం.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ఏపీ బీజేపీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. అందులో భాగంగా.. ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి సారథ్యంలోని పలువురు నేతల బృందం ఢిల్లీలోని పలు శాఖల మంత్రులను కలిశారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ యాక్షన్‌ ప్లాన్‌పై పురంధేశ్వరి టీమ్‌ సుదీర్ఘంగా చర్చించింది. స్టీల్‌ ప్లాంట్‌ను లాభాల బాటలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు.. అవసరమైన అంశాలతో కుమారస్వామికి వినతిపత్రం అందజేసింది పురంధేశ్వరి బృందం. ఇక.. ఏపీ బీజేపీ నేతల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి కుమారస్వామి.. అధికారులతో చర్చించి రెండు నెలల్లో మరోసారి భేటీ అవుదామని చెప్పారు. అటు.. కుమారస్వామిని కలిసినవారిలో కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ ఉన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Published on: Jun 26, 2024 08:10 PM