60 రోజులు సభకు రాకపోతే డిస్‌క్వాలిఫై.. పులివెందుల అసెంబ్లీకి ఉపఎన్నిక రావొచ్చు: రఘురామకృష్ణరాజు

Updated on: Sep 05, 2025 | 8:57 PM

60 రోజులు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై ఆటోమేటిక్‌గా వేటు పడుతుందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నిక రావొచ్చని జోస్యం చెప్పారు. ఒక్క పులివెందుల ఏంటి? మొత్తం 11 సీట్లకు ఉప ఎన్నికలు రావొచ్చంటూ పేర్కొన్నారు.

60 రోజులు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై ఆటోమేటిక్‌గా వేటు పడుతుందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నిక రావొచ్చని జోస్యం చెప్పారు. ఒక్క పులివెందుల ఏంటి? మొత్తం 11 సీట్లకు ఉప ఎన్నికలు రావొచ్చంటూ పేర్కొన్నారు. ఏపీలో ప్రతిపక్ష హోదాపై మళ్లీ రచ్చ మొదలైంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు రావాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే.,. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని వైసీపీ పట్టుబడుతుంది.

వైసీపీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ప్రతిపక్ష హోదా కావాలని బతిమిలాడుకోవడం మానుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు. 11 సీట్లకు ఉప ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ గెలిచినా ఉపయోగం ఉండదన్నారు రఘరామకృష్ణరాజు. అసెంబ్లీని బహిష్కరిస్తే పదవికి అనర్హులేనని చెప్పారు.

Published on: Sep 05, 2025 08:54 PM