Mysore Money: కర్నాటక ఎన్నికల సిత్రం.. మామిడి చెట్టు కొమ్మల్లో కరెన్సీ బ్యాగు..! వీడియో.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అగ్రనేతలు సైతం గల్లీ గల్లీ తిరుగుతూ ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు. అటు, ఓటర్లకు గాలం వేసేందుకుర బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అగ్రనేతలు సైతం గల్లీ గల్లీ తిరుగుతూ ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు. అటు, ఓటర్లకు గాలం వేసేందుకుర బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశాయి. ఎన్నికల వేళ భారీ మొత్తంలో నగదు పట్టుబడటం సంచలనంగా మారింది. ప్రధాన రాజకీయపార్టీలు ఓటర్లకు పంచడానికి పెద్ద ఎత్తున నగదును సమకూర్చాయన్న సమచారం మేరకు ఐటీ శాఖ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా కాంగ్రెస్ నేత ఇంట్లో భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, మైసూర్‌లోని సుబ్రమణ్య రాయ్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో మామిడి చెట్టుపై బాక్సులు ఉండటం గమనించారు. వాటిని తీసి చూడగా నోట్ల కట్టలు కనిపించాయి. మొత్తం డబ్బును అధికారులు సీజ్ చేశారు. వాటి విలువ కోటి రూపాయలు ఉన్నట్టు తెలిపారు. మొత్తం డబ్బును అధికారులు సీజ్ చేసినట్టు స్పష్టం చేశారు. రాయ్ పుత్తూరు కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ సోదరుడు కావడం విశేషం. ఇక, ఇప్పటిదాకా రూ.300 కోట్లకు పైగా లెక్క చూపని డబ్బును ఈసీ సీజ్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!