Telangana: కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి హాజరుకాని ఆ ఎమ్మెల్యే

|

Feb 01, 2024 | 1:54 PM

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ఫిబ్రవరి 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా హాజరయ్యారు. కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో పడిపోవడంతో తుంటి మార్పిడి శస్త్రచికిత్స కారణంగా డిసెంబర్ 9న మిగిలిన పార్టీ శాసనసభ్యులతో కలిసి ప్రమాణం చేయలేకపోయారు.

తెలంగాణ, ఫిబ్రవరి 1: ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు కేసీఆర్. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్‌లో ప్రమాణం చేశారు. తుంటి ఎముకకు శస్త్రచికిత్స కారణంగా అందరితో పాటు ప్రమాణస్వీకారం చేయలేకపోయిన కేసీఆర్ ఇవాళ ప్రమాణం చేశారు.

కేసీఆర్ రాక సందర్భంగా అసెంబ్లీలో సందడి నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి తరలివచ్చారు. కేసీఆర్‌కు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరుకాకపోవడం చర్చకు దారితీసింది.

ప్రమాణస్వీకార అనంతరం అసెంబ్లీ లాంజ్‌లో దివంగత మాజీ ప్రధాని పి.వి నరసింహారావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు కేసీఆర్. తన క్షేమ సమాచారం అడిగిన అందర్నీ పేరుపేరునా పలకరించారు గులాబీ బాస్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Feb 01, 2024 01:29 PM