Weather Alert: వడదెబ్బతో కానిస్టేబుల్ మృతి

Updated on: May 15, 2023 | 8:23 PM

వడదెబ్బ తగిలి కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పురపాలికలో చోటు చేసుకుంది.లక్షెట్టిపేట అంకతివాడకు చెందిన ముత్తే సంతోష్ (45) అనే పోలీస్ కానిస్టేబుల్ వడదెబ్బకు గురై ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. ఈయన రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. సొంతూరుకు వచ్చిన ఈయన వడదెబ్బ తగిలి అస్వస్థకు గురై రాత్రి ప్రాణాలు విడిచాడు.