శ్రీలంక నుంచి తిరిగి వస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ భారత్-లంక మధ్య ఉన్న రామసేతును దర్శించుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. “కొద్దిసేపటి క్రితం శ్రీలంక నుండి తిరిగి వస్తుండగా, రామసేతు దర్శనం చేసుకునే అదృష్టం నాకు కలిగింది. దైవిక యాదృచ్చికంగా, అయోధ్యలో సూర్య తిలకం జరుగుతున్న సమయంలోనే ఇది జరిగింది. ఇద్దరి దర్శనం చేసుకునే అదృష్టం నాకు లభించింది. ప్రభు శ్రీరాముడు మనందరినీ ఏకం చేసే శక్తి. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలి.” అంటూ ప్రధాని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.