PM Modi: ఆపరేషన్‌ సింధూర్‌ తరువాత ప్రధాని మోదీ తొలి ప్రసంగం.. సర్వత్రా ఉత్కంఠ

Updated on: May 12, 2025 | 8:01 PM

భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. అయితే.. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమయ్యాక తొలిసారి ప్రసంగం చేయనున్నారు.

భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. అయితే.. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమయ్యాక తొలిసారి ప్రసంగం చేయనున్నారు. దీంతో అందరి చూపు ప్రధాని మోదీ ప్రసంగం పైనే ఉంది.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతికారం తర్వాత మాట్లాడనున్న మోదీ.. దేశప్రజలకు ఏం చెప్పనున్నారు.. పాకిస్తాన్ కు ఎలాంటి వార్నింగ్ ఇవ్వనున్నారు..? అనేది చర్చనీయాంశంగా మారింది.

Published on: May 12, 2025 08:01 PM