Pink Power Run: బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం.. భాగ్యనగరంలో పింక్ పవర్ రన్.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

|

Sep 29, 2024 | 11:38 AM

క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.. దీనికి కారణం క్యాన్సర్ పై అవగాహన లేకపోవడం, క్యాన్సర్ ను మొదట్లోనే గుర్తించకపోవడం అని నిపుణులు పేర్కొంటున్నారు.

క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.. దీనికి కారణం క్యాన్సర్ పై అవగాహన లేకపోవడం, క్యాన్సర్ ను మొదట్లోనే గుర్తించకపోవడం అని నిపుణులు పేర్కొంటున్నారు. ముందే గుర్తిస్తే సరైన చికిత్సతో మహమ్మారితో పోరాడవచ్చు. ఈ నేపథ్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఎం.ఇ.ఐ.ఎల్ (మెయిల్) ఫౌండేషన్ , సుధా రెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా టీవీ9 ఆధ్వర్యంలో ‘పింక్ పవర్ రన్ 2024’ కార్యక్రమం ప్రారంభమైంది. 3 కి.మీ, 5 కి.మీ, 10 కి.మీ మారథాన్ కొనసాగుతోంది. ఈ మారథాన్ గచ్చిబౌలి స్టేడియం నుంచి ప్రారంభమై.. అక్కడే ముగిసింది… ఈ కార్యక్రమంలో దాదాపు 12వేల మంది నగరవాసులు పాల్గొన్నారు. ఈ రన్‌లో పాల్గొన్న యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

పింక్ పవర్‌ రన్‌కు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి..  విజేతలకు నగదు, మెడల్స్‌ బహుకరించారు. మహిళ హెల్త్‌కేర్‌ని మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌ చెప్పారు. కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉండటానికి- మహిళల ఆరోగ్యం కీలకమని చెప్పారు.

Follow us on