ప్రభుత్వాసుపత్రిలో తన భార్యకు డెలివరీ చేయించిన కలెక్టర్

|

Nov 11, 2023 | 9:59 AM

ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు పేదలపాలిట పెన్నిధిలా ఉండేవి. అలాంటివి రాను రాను గవర్నమెంట్‌ ఆస్పత్రి పేరు చెబితే భయపడేలా మారిపోయాయి. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు, మిషనరీ అన్నీ ఏర్పాటు చేసి పేదలకు భరోసా కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో మళ్లీ ప్రభుత్వ ఆస్పత్రులంటే ప్రజల్లో ఏర్పడిన భయాన్ని పోగొట్టేందుకు ఓ జిల్లా కలెక్టర్‌ తనదైనశైలిలో అడుగు ముందుకు వేశారు. తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించారు.

ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు పేదలపాలిట పెన్నిధిలా ఉండేవి. అలాంటివి రాను రాను గవర్నమెంట్‌ ఆస్పత్రి పేరు చెబితే భయపడేలా మారిపోయాయి. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు, మిషనరీ అన్నీ ఏర్పాటు చేసి పేదలకు భరోసా కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో మళ్లీ ప్రభుత్వ ఆస్పత్రులంటే ప్రజల్లో ఏర్పడిన భయాన్ని పోగొట్టేందుకు ఓ జిల్లా కలెక్టర్‌ తనదైనశైలిలో అడుగు ముందుకు వేశారు. తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించారు. ఈ ఘటన పార్వతీపురం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రులను ఎంత అభివృద్ధి చేసినా రోగులు మాత్రం దాదాపు ప్రవేట్ ఆసుపత్రి వైద్యానికే మొగ్గు చూపుతుంటారు. పేద, మధ్య తరగతి వారు సైతం అప్పో సొప్పో చేసి తమ స్తోమత కు మించి మరీ మెరుగైన వైద్యంతో కూడిన ప్రసవం కోసం కార్పోరేట్ ఆసుపత్రుల బాట పడుతుంటారు. ప్రజల్లో ఉన్న ఆ భావన అమాయక గిరిజనులు అధికంగా ఉన్న ఆ జిల్లాలో కొంతవరకైనా తొలగించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్నారి విద్యార్థికి టీచర్‌ అదిరిపోయే సర్‌ప్రైజ్‌.. ఏం చేసిందంటే ??

సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్

పెట్‌ డాగ్‌ వ్యాపారంలో లాభాలు ఎన్ని కోట్లో తెలుసా ??

సాలీడు కాటుతో అలర్జీతో ముఖం ఉబ్బిపోయి గాయం నల్లగా మారిన వైనం..

Anand Mahindra: ఢిల్లీలో వాయు కాలుష్యం నివారణకు ఆనంద్‌ మహీంద్రా సలహా