Watch Video: తెల్లని గుడ్డులో నల్లని రూపం.. ఏంటా అని చూసిన అధికారులు షాక్..

| Edited By: Srikar T

Jul 03, 2024 | 10:22 AM

పిల్లలకు పౌష్టికాహారం సరఫరాలో భాగంగా ప్రభుత్వం పంపిణీ చేసే కోడిగుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షమైన ఘటన కోరుట్ల పట్టణంలో జరిగింది. కోరుట్ల పట్టణంలోని రథాలపంపుకు చెందిన ఆకుల మన్విత అనే చిన్నారికి స్థానిక అంగన్వాడీ టీచర్ కోడిగుడ్లను అందజేసింది. కాగా ఆదివారం చిన్నారికి కోడి గుడ్డును అందించేందుకు ఉడకబెట్టే క్రమంలో ఓ గుడ్డు బరువు తక్కువగా ఉండి తేడాగా ఉన్నట్లు గమనించారు. వెంటనే గుడ్డుపై పెంకు తొలిచి చూడగా లోపల కోడిపిల్ల కదులుతూ కనిపించింది. దీంతో మన్విత తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురై ఈ విషయాన్ని స్థానికులకు తెలిపారు.

పిల్లలకు పౌష్టికాహారం సరఫరాలో భాగంగా ప్రభుత్వం పంపిణీ చేసే కోడిగుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షమైన ఘటన కోరుట్ల పట్టణంలో జరిగింది. కోరుట్ల పట్టణంలోని రథాలపంపుకు చెందిన ఆకుల మన్విత అనే చిన్నారికి స్థానిక అంగన్వాడీ టీచర్ కోడిగుడ్లను అందజేసింది. కాగా ఆదివారం చిన్నారికి కోడి గుడ్డును అందించేందుకు ఉడకబెట్టే క్రమంలో ఓ గుడ్డు బరువు తక్కువగా ఉండి తేడాగా ఉన్నట్లు గమనించారు. వెంటనే గుడ్డుపై పెంకు తొలిచి చూడగా లోపల కోడిపిల్ల కదులుతూ కనిపించింది. దీంతో మన్విత తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురై ఈ విషయాన్ని స్థానికులకు తెలిపారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే కాకుండా దుర్వాసన కూడా వచ్చింది. కోడి పిల్ల బయటకు రావడంతో.. పిల్లలు గుడ్లు తినడానికి భయపడుతున్నారు. గర్భిణీ మహిళలు కూడా గుడ్లు తినాలంటే ఆలోచిస్తున్నారు. పైగా గుడ్ల నాణ్యత కూడా కరువైందని.. నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on