AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్‌.. నీతా అంబానీ ఫిట్‌నెస్ రహస్యం ఇదే!

62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్‌.. నీతా అంబానీ ఫిట్‌నెస్ రహస్యం ఇదే!

Phani CH
|

Updated on: Sep 12, 2026 | 5:23 PM

Share

62 ఏళ్ల వయసులోనూ నీతా అంబానీ ఎంతో ఫిట్‌గా, చురుగ్గా కనిపించడానికి ఆమె క్రమశిక్షణతో కూడిన జీవనశైలే కారణమని చెబుతారు. వారానికి ఐదు నుంచి ఆరు రోజులు యోగా, స్ట్రెంత్‌ ట్రైనింగ్‌, స్విమ్మింగ్‌, మొబిలిటీ వ్యాయామాలు చేస్తారు. రోజుకు 7,000 అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. శాకాహారంతో పాటు ఆర్గానిక్‌ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ, చక్కెరకు దూరంగా ఉంటారు. ఫిట్‌నెస్‌ను చిన్నగా ప్రారంభించాలని సూచిస్తున్నారు.

వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ, 62 ఏళ్ల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా, యంగ్‌గా కనిపిస్తారు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ. ఆమె ఈ వయసులోనూ ఇంత ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి కారణం ఆమె కఠినమైన దినచర్య, ఆరోగ్యకరమైన జీవనశైలే. కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతతకు కూడా ఆమె ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. నీతా అంబానీ వారానికి ఐదు నుంచి ఆరు రోజులు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటారు. ప్రతిరోజూ ఒకేలా కాకుండా యోగా, మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంత్ ట్రైనింగ్ వంటి రకరకాల వ్యాయామాలు చేస్తారు. వీటితో పాటు స్విమ్మింగ్, ఆక్వా ఎక్సర్‌సైజ్‌లు కూడా ఆమె దినచర్యలో భాగమే. ముఖ్యంగా ఆరేళ్ల వయసు నుంచే భరతనాట్యం నేర్చుకున్న ఆమెకు డ్యాన్స్ చేయడం అంటే ఎంతో ఇష్టం. రోజూ క్రమం తప్పకుండా 7,000 అడుగులు నడవాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆహారపు అలవాట్లలోనూ ఆమె ఎంతో క్రమశిక్షణ పాటిస్తారు. ఆమె పూర్తిగా శాకాహారి మాత్రమే కాకుండా, కేవలం ఆర్గానిక్ మరియు ప్రకృతి సిద్ధమైన ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. శరీరానికి తగినంత ప్రోటీన్ అందేలా చూసుకుంటూనే, చక్కెర మరియు ఆర్టిఫిషియల్ స్వీట్నర్‌లకు పూర్తిగా దూరంగా ఉంటారు. “వయసుతో పోరాడటం కాదు, దాన్ని గౌరవంగా స్వీకరించాలి” అంటారు నీతా అంబానీ. తన మనవళ్లతో ఆడుకోవడానికి అవసరమైన శక్తి కోసమే తాను ఈ ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తున్నట్లు చెబుతారు. ఫిట్‌నెస్ మొదలుపెట్టే వారికి ఆమె చక్కటి సలహా ఇస్తున్నారు. రోజుకు కనీసం 30 నిమిషాలు, వారానికి నాలుగు రోజులు చిన్నగా మొదలుపెట్టాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్‌ బాస్‌!

అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు

Follow Us