కేరళలో నిఫా వైరస్‌ టెర్రర్‌ !! నిఫా ప్రాణాంతక వ్యాధి అంటున్న ఐసీఎంఆర్‌

|

Sep 19, 2023 | 9:44 AM

కరోనా వైరస్ మిగిల్చిన చేదు అనుభవాలు మరువకముందే.. ఇప్పుడు నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం దేశంలో నిఫా వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ వల్ల కేరళలో మరణాల కేసులు కూడా నమోదయ్యాయి. మరికొంతమంది దీని బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేర‌ళ‌లోని కొజికోడ్ జిల్లాను నిఫా వైర‌స్ కుదిపేస్తోంది. దీంతో కేర‌ళ ప్రభుత్వం హుటాహుటిన చ‌ర్యలు చేప‌ట్టింది. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల‌కు సోమ‌వారం నుంచి సెల‌వులు ప్రక‌టించింది.

కరోనా వైరస్ మిగిల్చిన చేదు అనుభవాలు మరువకముందే.. ఇప్పుడు నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం దేశంలో నిఫా వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ వల్ల కేరళలో మరణాల కేసులు కూడా నమోదయ్యాయి. మరికొంతమంది దీని బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేర‌ళ‌లోని కొజికోడ్ జిల్లాను నిఫా వైర‌స్ కుదిపేస్తోంది. దీంతో కేర‌ళ ప్రభుత్వం హుటాహుటిన చ‌ర్యలు చేప‌ట్టింది. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల‌కు సోమ‌వారం నుంచి సెల‌వులు ప్రక‌టించింది. విద్యాసంస్థలను సెప్టెంబర్ 24 వరకు మూసివేయాలని ఆదేశించింది. నిపా వైరస్ బారిన పడిన 21 మంది హై రిస్క్ రోగులు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారన్నారు కేరళ ఆరోగ్య మంత్రి వీణా. నిపాతో మరణించిన మొదటి వ్యక్తి కుమారుడైన తొమ్మిదేళ్ల బాలుడికి కూడా నిపా వైరస్ పాజిటివ్ వచ్చింది. అయితే, అతని ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని చెబుతున్నారు. మరోవైపు కేరళ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా పాకితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇదే జరిగితే దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ తరహా ఆంక్షలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో నిఫా పక్కనున్న రాష్ట్రాలు కూడా నిఫా తమ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చంద్రయాన్-3 సాధించిన అరుదైన ఘనత !! వీడియో విడుదల చేసిన యూట్యూబ్ ఇండియా

చాట్‌జీపీటీ అద్భుతం.. 17 మంది డాక్టర్ల వల్ల కాని పని చేసి చూపిందట

చిప్స్ తిని అస్వస్థతకు గురై చనిపోయిన బాలుడు.. ఛాలెంజ్‌లో భాగంగా ఘటన

ESI హాస్పిటల్‌లో దారుణం.. లిఫ్టు ఎక్కడమే పాపమైంది

అంతిమ యాత్రలో అపశ్రుతి.. మృతదేహాన్ని వదిలేసి వెళ్లిన బంధువులు