News Watch LIVE: లైగర్ పెట్టుబడులలో పూరి, ఛార్మి దొరికిపోయారా! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

|

Nov 18, 2022 | 7:55 AM

ఛార్మీ, పూరీ జగన్నాథ్‌ల బ్యాంక్ ఖాతాల్లోకి పెద్ద ఎత్తున విదేశీ నగదు జమ అయినట్లుగా తెలుస్తోంది. సుమారు12 గంటలపాటు కొనసాగిన విచారణలో పూరీ, ఛార్మీలపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సినీ నటి ఛార్మీల ఈడీ విచారణ ముగిసింది. ఛార్మీ, పూరీ జగన్నాథ్‌ల బ్యాంక్ ఖాతాల్లోకి పెద్ద ఎత్తున విదేశీ నగదు జమ అయినట్లుగా తెలుస్తోంది. సుమారు12 గంటలపాటు కొనసాగిన విచారణలో పూరీ, ఛార్మీలపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. లైగర్ సినిమా నిర్మాణానికి కావాల్సిన నిధుల్లో విదేశీ పెట్టుబడులపై ఆరా తీసింది. కాగా లైగర్‌ సినిమాకు సంబంధించి పెట్టుబడుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై పూరి, ఛార్మికి వారం రోజుల క్రితం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల విడుదలైన సినిమాకు సంబంధించిన వ్యవహారంలో దుబాయికి డబ్బులు పంపించి అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

Published on: Nov 18, 2022 07:55 AM