జుట్టు రాలిపోతోందా.. ఈ డ్రింక్‌ ట్రై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం

Updated on: Jan 19, 2026 | 8:35 PM

ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం, చర్మ సమస్యలు సాధారణం. వీటిని తగ్గించడానికి లోపలినుంచి పోషకాలు అందించే ఒక సూపర్‌ డ్రింక్ గురించి ఈ కథనం. యాపిల్, దానిమ్మ, బీట్‌రూట్, క్యారెట్, ఉసిరి వంటి వాటితో తయారుచేసే ఈ జ్యూస్‌ను ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తాగితే జుట్టు రాలడం తగ్గి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఆరోగ్యకరమైన పానీయం.

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకండా అందరినీ వేధించే సమస్య హెయిర్‌ఫాల్‌. ఎన్ని రకాల షాంపూలు, రకరకాల నూనెలు వాడినా ఇవి ఆశించిన ఫలితాలు ఇవ్వవు. అందుకే సహజసిద్ధంగా తలపైన అప్లై చేసేవి కాకుండా లోపలినుంచి పోషకాలు అందించి మీ జుట్టు రాలే సమస్యకు చక్కని పరిష్కారం ఇప్పుడు చూద్దాం. జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా మీ ముఖాన్ని ప్రకాశవంతం చేసే ఆరోగ్యకరమైన సూపర్‌ డ్రింక్‌ ఒకటి నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఆపిల్, దానిమ్మ, బీట్‌రూట్,క్యారెట్, గూస్బెర్రీని సిద్ధం చేసుకొని మిక్సర్‌లో వేసి బాగా గ్రైండ్‌ చేయాలి. ఈ జ్యూస్‌ను ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి. ఈ పానీయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వడపోయకూడదు సుమా.. మీకు అవసరమైనంత జ్యూస్‌ మాత్రమే తయారు చేసుకుని త్రాగండి. ఈ జ్యూస్‌ తాగడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు బలంగా ఉంటుంది. ఇంకా, ఈ జ్యూస్‌ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరం నుండి విషాన్ని తొలగించడంతో పాటు, ఈ పానీయం చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మీ ముఖం సహజ మెరుపును పెంచడానికి మీరు ఈ జ్యూస్‌ ని క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎముకలకు పుష్టినిచ్చే ఆహారాలు ఇవే

ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం.. అమర్‌నాథ్ కు ప్రయాణం ఇక్కడి నుంచే..

సంక్రాంతికి ఇంటికొచ్చి.. ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతూ

జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి