ఆ సమస్యలకు చెక్ పెట్టె విధంగా.. హైవేలపై QR కోడ్ బోర్డులు
జాతీయ రహదారులపై ప్రయాణికుల భద్రత, సహాయం కోసం NHAI QR కోడ్ బోర్డులను ఏర్పాటు చేస్తోంది. ప్రతి 10 కి.మీ.కు ఒకచోట ఈ కోడ్‌లుంటాయి. వీటిని స్కాన్ చేయడం ద్వారా అత్యవసర సేవలు, ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు, పోలీస్ స్టేషన్లు వంటి సమాచారాన్ని తక్షణమే పొందవచ్చు. ప్రమాదాలు, వాహన సమస్యల వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
హైవేపై వెళ్లే సమయంలో సమస్య వస్తే ఎవరిని సంప్రదించాలో తెలియక తికమకపడుతుంటారు. కొన్నిసార్లు పెట్రోల్ అయిపోయినా ఇబ్బంది పడాల్సిందే. ఇలా ప్రయాణంలో కావాల్సిన సమాచారం తెలుసుకోలేక అవస్థలు పడుతుంటారు. ఇలాంటి సమస్యల కోసం రహదారులపై ఎన్‌హెచ్‌ఏఐ క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేస్తుంది. జాతీయ రహదారి మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. అటువంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి వేళ ఎవరికి సమాచారం అందించాలో కూడా తెలియని పరిస్థితి. ఆ సమయంలో బాధితులకు సమాచారం తెలియక, సకాలంలో సేవలు అందక ఇబ్బంది పడుతుంటారు. రహదారులపై అత్యవసర సేవల సమాచారం తెలిపేందుకు క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. వీటిని ప్రతి 10 కిలో మీటర్లకు ఒక చోట అమరుస్తున్నారు. ఇవి రాకపోకల సమయంలో ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల మీదుగా 6 జాతీయ రహదారులు వెళుతున్నాయి. టోల్ ప్లాజాలు, నగరాల ఎంట్రీ రోడ్లు, హైవే ప్రారంభం, పెట్రోల్ బంక్‌లలో ఏర్పాటు చేయనున్నారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే పూర్తి సమాచారం ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. హైవేపై పాట్రోలింగ్, సమీపంలోని ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు, వాష్‌రూమ్స్, రెస్టారెంట్లు, పోలీస్ స్టేషన్ల నెంబర్లు తెలుస్తాయి. మనకు అవసరమైన అంశంపై క్లిక్ చేస్తే సమాచారం తెలిసిపోతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింత ఘటన.. గేదెకు ఒకే ఈతలో రెండు లేగ దూడలు
వివాహ వేదికపై పుష్-అప్‌లు ఇప్పుడిదో నయా ట్రెండ్
RBI: బంగారం కాకుండా ఈ లోహంతో లోన్ తీసుకోవచ్చా? ఎంత ఇస్తారు?
మీ పేరుతో ఇంకో సిమ్ యాక్టివేషన్.. తర్వాత విదేశాలకు అమ్మకం
Time Bank in Kerala: కేరళలో ‘టైమ్ బ్యాంక్’.. ఏం దాచుకుంటారంటే