ఒకప్పుడు నేషనల్ అవార్డు విన్నర్.. ఇప్పుడు అవకాశాలు లేక ఆటో డ్రైవర్

Updated on: Jul 11, 2025 | 11:37 AM

సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా మారిన వారు చాలామంది ఉన్నారు.కొంతమంది మాత్రం అవకాశాలు లేక దీనస్థితిలో ఉన్నారు. చాలామంది నటి నటులు ఇప్పుడు సినిమాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.కొంతమంది ఆర్థిక పరిస్థితి బాలేక రోడ్డున పడిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికే పలువురు మీడియా ముందుకు వచ్చి తమ దీనస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. అలాంటి వారిలో షఫీక్ సయ్యద్ ఒకరు. ఒకప్పుడు నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన షఫీక్ ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై ఒక వెలుగు వెలిగి ఆస్కార్ బరిలో నిలిచాడు. ప్రస్తుతం ఆ నటుడి పరిస్థితి దారుణంగా తయారైంది

. షఫీక్ సయ్యద్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించాడు.ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు అతను నటించిన సినిమా ఆస్కార్ కు కూడా నామినేట్ అయింది. కానీ ఆ తర్వాత ఆయనకు అవకాశాలు కరువయ్యాయి. ఇప్పుడు ఇలా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సలామ్ బాంబే సినిమాతో షఫీక్ సయ్యద్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1988లో విడుదలైన ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమా ద్వారా ముంబై వీధుల్లో బతికే పిల్లల కష్టాలను చూపించారు. మీరా నాయర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయింది. ఈ సినిమాలో చాయిపావ్ అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. తన అద్భుత నటనకు బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. కానీ అతనికి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఆ తర్వాత పతనంగానే సినిమా ఒక్కటే చేశాడు. అవకాశాలు లేక ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో ఆటో నడుపుతున్నాడు. తల్లి, భార్య, నలుగురు పిల్లలతో ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు. కుటుంబ భారాన్ని మోస్తూ ఆటో స్టీరింగ్ తిప్పుతున్నాడు షఫీక్ సయ్యద్.

మరిన్ని వీడియోల కోసం :

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో