ఆకాశంలో అద్భుతం.. విశ్వంలో ఉన్న బుల్లి గెలాక్సీల వీడియో

Updated on: Jun 21, 2025 | 11:49 AM

చూడటానికి అవి చిన్న చిన్న గెలాక్సీలే. కానీ, వాస్తవానికి మహా గట్టి గెలాక్సీలు. అటూ ఇటుగా ఈ అనంత విశ్వంతో పాటే అవీ పురుడు పోసుకున్నాయి. మన విశ్వం 1,380 కోట్ల ఏళ్ల కింద ఉనికిలోకి రాగా, ఈ బుల్లి నక్షత్ర మండలాల వయసు ఏకంగా 1,300 కోట్ల ఏళ్లు! ఉనికిలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ బుల్లి నక్షత్ర మండలాల నుంచి అనూహ్యమైన ఆకుపచ్చని కాంతి అపార పరిమాణంలో వెలువడుతోంది.

వెయ్యి కోట్ల పై చిలుకు ఏళ్ల కింద ఎటు చూసినా ఏమీ కనిపించని విశ్వాన్ని పారదర్శకంగా, ఇప్పుడు మనం చూస్తున్న విధంగా మార్చింది ఆ కాంతేనట. ఆ లెక్కన మానవ ఆవిర్భావం కూడా దాని పుణ్యమేనని సైంటిస్టులు తేల్చారు. అంతటి కీలకమైన కాంతికి బేస్‌ అయిన బుల్లి గెలాక్సీలను జేమ్స్‌ వెబ్‌ టెలీస్కోప్‌ అద్భుతంగా చిత్రీకరించింది. అంతరిక్ష శాస్త్రవేత్తలు వాటిని ముద్దుగా రెడ్‌ షిఫ్ట్‌–7 అని పిలుచుకుంటున్నారు.గెలాక్సీల్లో నుంచి నేటికీ వెలువడుతున్న ఆ ఆకుపచ్చని వెలుగును జేమ్స్‌ వెబ్‌ సాయంతో పరిశోధకులు గుర్తించారు. విశ్వంలోని ఈ గెలాక్సీల సమూహాన్ని అబెల్‌ 2744 అనే పేరుతో పిలుస్తున్నారు. దీని తాలూకు అపరిమితమైన గురుత్వాకర్షణ లక్షణం కూడా జేమ్స్‌ వెబ్‌ చిత్రీకరణలో సాయపడింది. జేమ్స్‌ వెబ్‌ తాలూకు నియర్‌ ఇన్ఫ్రా రెడ్‌ కెమెరా, ఇన్ఫ్రా రెడ్‌ స్పెక్ట్రో గ్రాఫ్‌ లెన్స్‌ మన విశ్వాన్ని ఏకంగా మరో 400 కోట్ల ఏళ్లు వెనక్కు చూడగలిగాయి. ఈ క్రమంలోనే ఈ బుల్లి గెలాక్సీల ఉనికి తొలిసారి బయటపడింది.

మరిన్ని వీడియోల కోసం :

మీ ఇంటిలోకి పాములు వస్తాయని భయపడుతున్నారా? ఈ మొక్కలు నాటి చూడండి!

ఇంటికి వచ్చిన భర్తకు ప్రేమగా మద్యం పోసిన భార్య తర్వాత ఊహించని ట్విస్ట్!

ఇప్పుడు నేను ఫుల్ హ్యాపీ ..ఆనందంలో సమంత వీడియో