Nani: నాని నెక్స్ట్ లెవెల్ ప్లాన్.. టాప్ డైరెక్టర్లతో వరుసగా మెగా ప్రాజెక్ట్స్!
వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని, భారీ ప్రాజెక్ట్స్‌తో తన కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 'ది ప్యారడైజ్' షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన, ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో 'బ్లడీ రోమియో' చేయనున్నారు. వెంకీ అట్లూరి, శేఖర్ కమ్ముల వంటి టాప్ దర్శకులతోనూ చర్చలు కొనసాగుతుండటంతో నాని లైనప్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
నాచురల్ స్టార్ నాని స్పీడ్ మామూలుగా లేదు. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ హీరో, తన అప్‌కమింగ్ మూవీస్ విషయంలో క్రేజీ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఏకంగా టాలీవుడ్, కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌తో తన లైనప్ సెట్ చేసుకుని బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఫాలో దిస్ స్టోరి. యాక్షన్, క్లాస్, మాస్.. ఇలా ఏ జోనర్ అయినా తన న్యాచురల్ యాక్టింగ్‌తో ఇరగదీసే నాని, ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలతో కలిసి పని చేస్తున్నారు. దసరా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ వర్క్‌లో నాని ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో మరోసారి సాలిడ్ పాన్ ఇండియా హిట్ కొట్టాలని కష్టపడుతున్నారు. ది ప్యారడైజ్ పూర్తయిన వెంటనే, స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ మూవీ స్టార్ట్ చేస్తారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఓజీ లాంటి బ్లా్క్ బస్టర్ తరువాత సుజిత్ రూపొందిస్తున్న సినిమా కావటంతో బ్లడీ రోమియో మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరికొన్ని క్రేజీ కాంబోస్ కూడా నాని లైనప్‌లో ఉన్నాయి. సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో హిట్స్ కొట్టిన వెంకీ అట్లూరితో నాని ఓ సినిమా చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. రీసెంట్‌గా బ్లాక్ బస్టర్ ‘బ్లాస్ట్’ మూవీ దర్శకుడితోనూ ఓ ప్రాజెక్ట్ ఉండబోతుందన్న ప్రచారం జరుగుతోంది. ఎప్పటినుంచో డిస్కషన్‌లో ఉన్న శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ కూడా త్వరలోనే ఫైనలైజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇలా ప్రాజెక్ట్స్‌తో నాచురల్ స్టార్ లైనప్ సూపర్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr.NTR: ‘డ్రాగన్’ కోసం తారక్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా
వయసు పెరిగినా వేగం తగ్గలేదు.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న నలుగురు సీనియర్ స్టార్‌ల బిజీ షెడ్యూల్
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!
మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!
సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా
మొబైల్ టార్చ్‌లైట్ వెలుగులో బస్సు నడిపిన డ్రైవర్
దేవుడా.. ఈ నగరానికి ఏమైంది.. ఓవైపు కోతులు..మరోవైపు శునకాల బీభత్సం
ప్రాచీన శివాలయానికి జాతీయ హోదా!
చైనాలో గుడ్డు కూర ధర ఎంతో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ..

